CM Revanth Reddy News | క్రీడలను ప్రోత్సహించకపోవడం మూలంగానే యువత మత్తుపదార్ధాల వైపు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నూతన స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణలో నూతన అధ్యాయం మొదలవుతుంది ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి క్రీడా సంస్థలు, అకాడమీలు, ప్లేయర్లతో 9 ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో కొత్త స్పోర్ట్స్ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా నూతన స్పోర్ట్స్ పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు.









