Friday 18th April 2025
12:07:03 PM
Home > తాజా > ఎవరినీ బయటకి పంపేది లేదు.. వాళ్లకు అదే సరైన శిక్ష: సీఎం రేవంత్

ఎవరినీ బయటకి పంపేది లేదు.. వాళ్లకు అదే సరైన శిక్ష: సీఎం రేవంత్

revanth reddy

Revanth Reddy Interesting Comments | తెలంగాణ కొత్త ప్రభుత్వంలో జరుగుతున్న శాసనసభ సమావేశాలు శుక్రవారం వాడివేడిగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేటీఆర్ ల మధ్య కౌంటర్, ఎన్ కౌంటర్ లతో మాటల యుద్ధం జరిగింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో పలు వైఫల్యాలను ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి చూపారు.

రైతు బీమా, పంట గిట్టుబాటు ధర, సాగు నీటి ప్రాజెక్టులు, టీఎస్పీఎస్సీ లీకేజీ, పదో తరగతి పేపర్ల లీకేజీ లాంటి అంశాలను సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

రేవంత్ రెడ్డి మాట్లాడతున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీంతో వాళ్లను బయటికి పంపించేయండి అంటూ అధికార పక్ష ఎమ్మెల్యేల నుంచి కొందరు సలహా ఇచ్చారు.

దానిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ సభ్యుల్లో ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించేది లేదన్నారు. వాళ్లను ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తామని.. వారికి ఇదే శిక్ష అని వ్యాఖ్యానించారు.

You may also like
‘ఇఫ్తార్ పార్టీ వివాదం..విజయ్ పై ఫత్వా జారీ’
‘భార్యతో కూర్చుని మాట్లాడండి..ముఖ్యమంత్రికి సుప్రీం సూచన’
‘డ్రగ్స్ రైడ్..హోటల్ నుండి పారిపోయిన దసరా విలన్’
‘రైళ్లలోనూ ఏటీఎం సేవలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions