Cm Revanth Chit Chat | బీఆరెస్ ( Brs ) ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్ ( KCR ), హరీష్ రావు ( Harish Rao ) అండగా నిలవాలని సీఎం రేవంత్ సూచించారు.
బుధవారం శాసనసభ సమావేశాల అనంతరం సీఎం మీడియా ( Media )తో చిట్ చాట్ నిర్వహించారు. సబితా ఇంద్రారెడ్డి ని సొంత అక్కలా భావించినట్లు సీఎం చెప్పారు.
కానీ ఎంపీ టికెట్ వస్తే తన కోసం పని చేస్తానని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి, మల్కాజిగిరి ( Malkajgiri ) టికెట్ రాగానే బీఆరెస్ లోకి వెళ్లిందని తెలిపారు. గతంలో సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే తనపై రెండు కేసులు పెట్టినట్లు సీఎం అన్నారు.
సునీతా లక్ష్మారెడ్డి బీఆరెస్ లోకి వెళ్లిన తర్వాత తనపై ఉన్న రెండు కేసులను తీయించలేకపోయిందని రేవంత్ పేర్కొన్నారు.
సభలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడడానికి మేం సరిపోతాం అని కేటీఆర్ అంటున్నారని అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు? కేటీఆర్ ను ప్రకటించవచ్చుగా అని సీఎం ప్రశ్నించారు.