Monday 28th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > యూసీసీ ని వ్యతిరేకిస్తున్నాం…! కేసీఆర్ సంచలన నిర్ణయం

యూసీసీ ని వ్యతిరేకిస్తున్నాం…! కేసీఆర్ సంచలన నిర్ణయం

cm kcr

KCR opposes uniform civil code

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (uniform civil code) ఈ నెలాఖరిలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సంధర్బంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (all india muslim personal law board) అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్‌, బోర్డు కార్యవర్గ సభ్యలు సమావేశంలో పాల్గొన్నారు.

వీరితో భేటీ అనంతరం కేసీఆర్ ఉమ్మడి పౌరస్మృతిని బీఆరెఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అని జాతీయ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నాయకత్వం కూడా సంకేతాలు ఇస్తున్నాయి. భోపాల్ లో జరిగిన మీటింగ్ లో కూడా దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ముస్లిం సమాజం కూడా ఈ బిల్లుపై ఆలోచించాలని తెలిపారు.


ప్రగతి భవన్| ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ తో సమావేశం అనంతరం కేసీఆర్ ఉమ్మడి పౌరస్మృతి పైన తమ పార్టీ విధానాన్ని ప్రకటించారు. ఉమ్మడి పౌరస్మృతికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టారు.

cm kcr views on uniform civil code| భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీక చెందినది. అటు వంటి దేశంలో ఐక్యతను చీల్చి అనైక్యతను పెంచడానికి కేంద్రప్రభుత్వం కుయ్యుక్తులు చేస్తుందని ధ్వజమెత్తారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, జాతులు, ఇతర ప్రాంతాలు, ఇతర మతాలు అలగే హిందూమతంలోని వారినే అయోమయానికి గురిచేయలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తుందని వ్యాఖ్యానించారు.

పూర్వం నుండి వస్తున్న సంప్రదాయ, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలకు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్తుందని అందుకే తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తొమ్మిది ఏండ్ల బీజేపీ పాలనలో ప్రజల అబివృద్ధిని విస్మరించి ఇప్పుడు యూసీసీ లాంటి బిల్లును తీసుకువచ్చి ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని సీఎం ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి యూసీసీ కి వ్యతిరేకంగా పోరాడుతామని కేసీఆర్ తెలిపారు.

అలాగే ఉభయ సభల్లో (parliment) బిల్లును వ్యతిరేకించాలని కె. కేశవరావు, నామ నాగేశ్వరావు లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లు పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ధన్యవాదాలు తెలిపింది.

You may also like
kcr
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు లీగల్ నోటీసులు!
hydraa
నగరంలో మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు.. ఎక్కడంటే!
delivery boy
డెలివరీ చేయాల్సిన ల్యాప్ టాప్ ను దొంగిలించి రూ.15 వేలు డిమాండ్!
meat shops
మాంసం ప్రియులకు అలర్ట్.. రేపు నాన్ వెజ్ బంద్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions