Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘హైదరాబాద్ లో వర్షం..పవర్ కట్స్ లేకుండా చూడండి’

‘హైదరాబాద్ లో వర్షం..పవర్ కట్స్ లేకుండా చూడండి’

CM directs officials to be on alert in view of heavy rain | అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని తెలిపారు.

పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions