Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తమ్ముడి కోసం అన్న.. పిఠాపురం ప్రజలకు ‘చిరు’ విజ్ఞప్తి!

తమ్ముడి కోసం అన్న.. పిఠాపురం ప్రజలకు ‘చిరు’ విజ్ఞప్తి!

Chiranjeevi

Chiranjeevi Supports Pawan | జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను గెలిపించాలని పిఠాపురం (Pithapuram) ప్రజలను కోరారు ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా, అందరికి మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడని చిరంజీవి చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు, కానీ పవన్ మాత్రం సొంత సంపాదనను ప్రజా సేవకోసం వినియోగించారని పేర్కొన్నారు.

తాను బలంగా నమ్మిన సిద్ధాంతాల కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జనమే జయం అని భావించే జనసేనాని ఎం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి.

ప్రజల కోసం సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా అండగా నిలబడి, అందరి కలలను నిజం చేస్తాడని పవన్ కు అండగా నిలిచారు మెగాస్టార్.

You may also like
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!
bandi sanjay kumar
అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!
pawan kalyan
కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions