Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు!

చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు!

mysterious pneumonia

Mysterious Pneumonia | చైనా(China)లో అంతుచిక్కని న్యుమోనియా కేసులు (Mysterious Pneumonia) విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున్న బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

కరోనా లాంటి మరో మహమ్మారి వస్తుందేమనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. చైనాలో న్యుమోనియా కేసులు మరింత వేగంగా వ్యాప్తి చెందుటుండటంతో అప్ర‌మత్తంగా ఉండాల‌ని కీలక సూచనలు చేసింది.

ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు సిద్ధం చేయాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. ఎలాంటి వైద్య అత్యవసర ప‌రిస్ధితి ఎదురైనా అధిగ‌మించేందుకు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌ను ఆదేశించింది.

ఆస్ప‌త్రుల్లో త‌గిన ఏర్పాట్ల‌కు సంబంధించి స‌మీక్షించాల‌ని రాష్ట్రాల‌ను కోరింది. చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.

చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు.

భారత్‌కు ఈ న్యుమోనియా ముప్పు తక్కువేనని కేంద్రం ప్ర‌క‌టించింది. అయినప్పటికీ రాష్ట్రాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిచింది.

మరోవైపు గత కొన్ని రోజులుగా చైనాలో ఈ అంతుచిక్కని న్యుమోనియో కేసులతో  ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి.

ఈ తరహా లక్షణాలతో చైనా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చైనాలో కొత్త ర‌కం వైర‌స్ వ్యాపించింద‌నే వార్త‌ ల‌ను డ్రాగ‌న్ దేశం కొట్టిపారేసింది.

ప్రస్తుతం ప్రబలుతున్న వ్యాధులు ఇవి సీజ‌న‌ల్ శ్వాస‌కోశ స‌మ‌స్యేల‌న‌ని చైనా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

You may also like
mysterious pneumonia
చైనాలో మరో అంతుచిక్కని వ్యాధి.. మహమ్మారిగా మారుతుందా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions