Chhattisgarh Man Swallows Live Chick | మంత్రాలకు చింతకాయలు రాలవు అని పెద్దలు పదే పదే చెప్పినా కొందరు మాత్రం పట్టించుకోరు.
ఇలానే ఓ మాంత్రికుడి మాయమాటలు నమ్మి వ్యక్తి ప్రాణాలనే కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని అంబికాపూర్ పట్టణానికి చెందిన 35 ఏళ్ల ఆనంద్ కుమార్ యాదవ్ ( Anand Kumar Yadav ) కు పెళ్లి అయినా పిల్లలు కలగలేదు. దీంతో ఆయన స్థానిక మాంత్రికుడిని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పిల్లలు కలగాలంటే ఓ నల్ల కోడిపిల్లను అది బ్రతికుండగానే మింగాలని మాంత్రికుడు సూచించాడు.
అతని మాయమాటలు నమ్మిన ఆనంద్ కుమార్ ఓ నల్ల కోడిపిల్లను అమాంతం మింగేశాడు. దీంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు. వెంటనే అంబికాపూర్ లోని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది.
ఊపిరి ఆడక ఆనంద్ కుమార్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.