Chandrababu Extends Birthday Wishes To Ys Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ) పుట్టినరోజు సందర్భంగా శనివారం వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
జగన్ బర్త్డే ( Birth Day ) సందర్భంగా కేక్ కటింగ్, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.
ఆటు పోట్లని అవలీలగా ఎదుర్కోగల ధీరుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విషెస్ తెలియజేశారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ వార్మ్ బర్త్డే గ్రీటింగ్స్ ( Warm Birthday Greetings ) టు జగన్ గారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పొందాలని ‘ సీఎం కోరుకున్నారు.