Tuesday 15th July 2025
12:07:03 PM
Home > తాజా > దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్.. హీరోయిన్ కామెంట్స్ పై కేటీఆర్ సెటైర్!

దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్.. హీరోయిన్ కామెంట్స్ పై కేటీఆర్ సెటైర్!

ktr

KTR Satires On Kangana | ప్రముఖ నటి, మండి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranauth) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ..దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని అయిన సుభాష్ ఎక్కడికి వెళ్లారు? అంటూ ప్రశ్నించారు. అలాగే ఆయన్ను దేశంలో అడుగుపెట్టకుండా చేశారని ఫైర్ అయ్యారు. దీంతో కంగనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కంగనా వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఉత్తర భారత దేశం నుండి ఒక బీజేపీ అభ్యర్థి తొలి ప్రధాని సుభాష్ అంటున్నారు, మరో దక్షిణ భారత బీజేపీ నేత తొలి ప్రధాని మహాత్మా గాంధీ అంటున్నారు, అస్సలు ఇలాంటి వారు ఎక్కడ చదువుకున్నారు అంటూ సెటైర్లు గుప్పించారు కేటీఆర్!

You may also like
nimisha priya
యెమెన్ లో కేరళ నర్సు ఉరిశిక్షపై కేంద్రం కీలక వ్యాఖ్యలు!
‘ఆదర్శ ఘటన..తల్లీ నీకు వందనం’
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సీఎం
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions