Monday 28th July 2025
12:07:03 PM
Home > తాజా > తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత!

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత!

shanti swaroop

Shanti Swaroop | తెలుగులో తొలి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Santhi Swaroop) కన్నుమూశారు. రెండురోజుల కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1983 నవంబర్ 14 నుంచి శాంతి స్వరూప్ దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు.  

దాదాపు పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి వార్తలు చెప్పేవారు. 2011వరకు దూరదర్శన్‌లో పని చేసిన ఆయన ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions