KTR Challenges CM Revanth | రుణమాఫీపై (Loan Waiver) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సక్సెస్ అయిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ లేకుండా మీడియాను తీసుకుని కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికైనా చర్చకు సిద్దమన్నారు. అవసరమైతే సీఎం స్వగ్రామం కొండారెడ్డి పల్లెకు కూడా వెళదామన్నారు.
వంద శాతం రుణమాఫీ విజయవంతం అయ్యిందని ఒక్క రైతు చెప్పినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ దగా చేసిందన్నారు. రుణాలు రూ. 40 వేల కోట్లు అని చెప్పి, మాఫీ చేసిందెంత అని ప్రశ్నించారు.
చాలా మంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఇన్ కం ట్యాక్స్ కట్టారని.. రేషన్ కార్డు లేదని రుణమాఫీ చెయ్యలేదన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారని సెటైర్లు వేశారు. కేవలం 22లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసుపెట్టాలన్నారు.