Saturday 10th May 2025
12:07:03 PM
Home > తాజా > ఎన్నికల ముందు కొత్త పథకం ప్రకటించిన కేటీఆర్.. అదేంటంటే!

ఎన్నికల ముందు కొత్త పథకం ప్రకటించిన కేటీఆర్.. అదేంటంటే!

ktr

KTR Announces New Scheme | తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒక కొత్త పథకం రూపొందిచే యోచనలో ఉన్నట్ల తెలిపారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).

శుక్రవారం రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనే భావనతో ఉద్దేశంతో హౌసింగ్ ఫర్ ఆల్ అనే పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.

లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునే మధ్య తరగతి కుటుంబాల కోసం వడ్డీ రాయితీ ఇస్తామని తెలిపారు.

1200 నుండి 1500 sft. ల మధ్య లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు లేదా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వమే ఇంటరెస్ట్ కట్టే విధంగా నూతన పథకాన్ని కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు కేటీఆర్.

దీని ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్, గృహ లక్ష్మీ స్కీమ్స్ కూడా సమాంతరంగా నడుస్తాయని చెప్పారు.

తెలంగాణ లో వంద శాతం అక్షరాస్యత సాధించే విధంగా బీఆరెస్ ప్రభుత్వం దోహద పడబోతుందని తెలిపారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

You may also like
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions