Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ!

సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ!

kalvakuntla kavitha arrested
  • కీలక అంశాలను ప్రస్తావన
  • ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కాలేనని స్పష్టీకరణ
  • 41ఏ నోటీసు రద్దు చేయాలని విజ్ఞప్తి

కపోతం, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. ఇటీవల ఆ కేసులో తనను నిందితురాలిగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక అంశాలను లేవనెత్తారు.

ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని పేర్కొన్నారు.  ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి లేదా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు.

నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. అని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read Also: “తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని తెలిపారు కవిత. పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించానని తెలిపారు.

“ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుంది. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను.

నియమనిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది.

రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను.ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి” అని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

You may also like
మరో రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా
Jagga Reddy file photo
‘వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల పొత్తు’
mlc mahesh and kavitha
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలింది: ఎమ్మెల్సీ మహేశ్!
BIG BREAKING : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు బెయిల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions