BRS MLAs Meet CM Revanth | బీఆరెస్ పార్టీ (BRS Partyకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆయన నివాసంలో కలవడం చర్చనీయాంశంగా మారింది.
మెదక్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె మానిక్ రావు సీఎం తో భేటీ అవ్వడంతో వీరు పార్టీని విడనున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు తాము పార్టీని విడడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతామని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా సమస్యలను, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను నెరవేర్చలని కోరడం కోసమే సీఎం ను కలిసినట్లు తెలిపారు మెదక్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. అలాగే పార్టీ మారనున్నట్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దుబ్బాక ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కొరడానికి మాత్రమే సీఎం ను కలిసినట్లు వెల్లడించారు. సీఎం ను కలవడం తమ హక్కని, ప్రజల సమస్యల కోసం వంద సార్లైనా సీఎం ను కలుస్తామని అందులో తప్పేమీ ఉందన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి.