BRS MLA Kova Laxmi Throws Water Bottle On Congress Leader | కాంగ్రెస్ నేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆరెస్ మహిళా ఎమ్మెల్యే వాటర్ బాటిల్ ను విసిరేశారు.
కొమరంభీం జిల్లా జన్కపూర్ లో గురువారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం రసాభాసగా జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆరెస్ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
దింతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వాగ్వాదం సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే లక్ష్మీ వాటర్ బాటిల్ ను కాంగ్రెస్ నాయకుడిపై విసిరేశారు.









