BJP MP Pratap Sarangi accused Rahul Gandhi of causing him injury | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ( BR Ambedkar ) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ క్రమంలో అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు ప్రాంగణంలో గురువారం గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి.
అంబేడ్కర్ పై వ్యాఖ్యలను నిరసిస్తూ విపక్ష ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ను అవమానించిందంటూ బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా పార్లమెంటు కు వస్తున్న అధికార ఎంపీలను విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎంపీకి గాయం అయ్యింది.
ఎంపీలను అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దింతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తాను మెట్ల మీద నిల్చున్న సమయంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, అతడు వచ్చి తన మీద పడడంతో తాను కింద పడినట్లు సదరు ఎంపీ ఆరోపించారు.