BJP candidate for Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి పేరునే ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మరోవైపు బీఆరెస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. మంగళవారం సునీతకు బీ ఫార్మ్ తో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును బీఆరెస్ అధినేత కేసీఆర్ అందజేసిన విషయం తెల్సిందే. ఇకపోతే జూబ్లీహిల్స్ కు నవంబర్ 11న ఉప ఎన్నిక, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.








