Saturday 4th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అమరావతిలో బిల్ గేట్స్

అమరావతిలో బిల్ గేట్స్

Bill Gates In Andhrapradesh | మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. ఇక్కడ హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా సచివాలయం చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. అనంతరం భేటీలో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0, మరియు బ్లాక్ చెయిన్ ద్వారా భూ రికార్డుల భద్రత వంటి అంశాలను ఆయనకు వివరించారు సీఎం. టెక్నాలజీలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని “గ్రేట్ వర్క్” అని బిల్ గేట్స్ కొనియాడారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions