Bihar School Holidays | సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం (Bihar Government) సంచలన నిర్ణయం తీసుకుంది.
పాఠశాల సెలవులకు సంబంధించి నితీశ్ కుమార్ సర్కార్ చేసిన సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బిహార్ ప్రభుత్వం విద్యా శాఖకు సంబంధించి 2024 సెలవుల జాబితాను విడుదల చేసింది.
అందులో జన్మాష్టమి (Janmastami), రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, వసంత పంచమి, జీవితపుత్రిక పండగల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వీటితోపాటు జాతీయ సెలవు దినాలైన మేడే, గాంధీ జయంతి రోజల్లో కూడా హాలీడేస్ రద్దు చేసింది. మరోవైపు రంజాన్, బక్రీద్ లకు చెరో మూడు రోజులు, మొహర్రానికి రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
గురుగోవింద్ సింగ్ జయంతి, రవిదాస్ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించింది నితీశ్ సర్కార్.
ఇక ఉపాధ్యా యులకు ఉన్న 60 రోజుల సెలవుల్లో 38 రోజులు పాఠశాలకు రావాలని ఆదేశించింది. ఏడాదిలో 22 రోజులు మాత్రమే సెలవు ఉంటుందని తెలిపింది.
టీచర్లకు సమ్మ ర్ వెకేషన్ ని పూర్తిగా రద్దు చేసింది. ఈ క్యాలెండర్‌కు సంబంధించి నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.
హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా నితీష్ కుమార్ పరిపాలన ఉందంటూ బీజేపీ నేత సుశీల్ మోదీ ఆరోపించారు.