Bihar CM removes hijab from newly appointed doctor’s face | బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ఓ పని ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసింది. నియామక పత్రాలు అందించే సమయంలో సీఎం నితీష్ ఓ యువ మహిళా డాక్టర్ ధరించిన హిజాబ్ ను లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ నితీష్ మానసిక స్థితిపై ప్రశ్నించాయి. బీహార్ రాజధాని పట్నాలో సోమవారం ఓ అధికారిక కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన 1200 మంది ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు సీఎం.
ఈ సందర్భంగా నుస్రత్ పర్వీన్ నియామక పత్రాన్ని తీసుకోవడానికి వేధికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో పత్రాన్ని అందజేస్తూ సీఎం హిజాబ్ ను తొలగించాలని సూచించారు. క్షణాల వ్యవధి తర్వాత సీఎం ఏకంగా మహిళ ధరించిన హిజాబ్ ను స్వయంగా కిందకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పక్కనున్న వారు నవ్వారు. వెంటనే కలగజేసుకున్న అధికారులు సదరు డాక్టర్ కు నియామక పత్రాన్ని అందజేసి పంపించేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదం రాజుకుంది. ‘నితీష్ కుమార్ కు ఏమైంది? ఆయన మానసిక స్థితి మరింత అద్వాన్నంగా మారిందా లేక ఆయన పూర్తిగా సంఘీగా మారిపోయారా’ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ ప్రశ్నించింది.








