Bihar Cm Nitish Kumar News | బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ రాంవిలాస్ మరియు ఇతర పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దింతో బీహార్ సీఎంగా పదవసారి నితీష్ ప్రమాణం చేయనున్నారు.
అలాగే అత్యధిక కాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అతికొద్ది మంది నేతల్లో నితీష్ సైతం ఉన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే పక్షం 243 స్థానాలకు గాను 202 సీట్లలో విజయ దుంధుభి మోగించింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, మిగిలిన చిన్న పార్టీలు ఇతర స్థానాల్లో గెలిచాయి. దింతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు.
సోమవారం జరగనున్న బీహార్ మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలువుతారు. అనంతరం ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తారు అనేది తెలుస్తోంది. అనంతరం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో నవంబర్ 19 లేదా 20న నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ను బట్టి తేదీ ఖరారు కానుంది. ఇప్పటికే పట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.









