BCCI Rules Out Immediate Sacking of Gautam Gambhir as India Coach | టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరికొన్ని ఏళ్లపాటు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్ లో టీం ఇండియా వైట్ వాష్ అయ్యింది. దింతో గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయన్ను తొలగించాలని కొందరు డిమాండ్లు సైతం చేస్తున్నారు. తాజగా మీడియాతో మాట్లాడిన గంభీర్ తన భవిష్యత్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని, ఒక వ్యక్తి కన్నా జట్టే ముఖ్యమని పేర్కొన్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులు స్పందించారు. గంభీర్ కు మద్దతుగా నిలిచారు. తొందరపాటు నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యం ప్రస్తుతానికి ఏమీ లేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీం ఇండియా కీలక మార్పు దశలో ఉంది, ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు ఉండవు అని అధికారులు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఉందని ఈ నేపథ్యంలో కోచ్ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉండవని పేర్కొన్నారు.









