Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > యూపీ సీఎంను కలిసిన బాలయ్య..యోగికి అఖండ త్రిశూలం

యూపీ సీఎంను కలిసిన బాలయ్య..యోగికి అఖండ త్రిశూలం

Balakrishna Meets CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా అఖండ త్రిశూలాన్ని సీఎంకు బహుకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘అఖండ-2 తాండవం’ డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆదివారం యూపీ సీఎం యోగిని కలిసింది అఖండ టీం. ఈ సందర్భంగా సినిమా కథను సీఎంకు వివరించారు బోయపాటి. అలాగే సినిమాలోని కొన్ని ప్రత్యేక సీన్లను సీఎం యోగికి చూపించారు. సనాతన ధర్మ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించే సినిమాలు అవసరం అని యోగి నొక్కిచెప్పారు.

అఖండ-2 టీం గొప్పగా పనిచేసిందని, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన అభినందించారు. అనంతరం యోగికి అఖండ-2 లో కథానాయకుడు వినియోగించిన త్రిశూలాన్ని బహుకరించారు బాలయ్య. యోగితో భేటీ అద్భుతంగా జరిగినట్లు సంతోషం వ్యక్తం చేశారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions