- ఆస్టిన్ హరిహర క్షేత్రం ఆలయ ప్రతినిధులతో భేటి
- ఆలయ సందర్శనకు ఆహ్వానం పలికిన చైర్మన్ భరత్ కుమార్
Harihara Kshetram Chairman Meets Swami Swaroopananda | అగ్రరాజ్యం అమెరికా (America)లోనూ హిందువుల ప్రాబల్యం పెరిగి, ఆధ్యాత్మికత వెల్లివిరియాలని స్వామి పరిపూర్ణానంద ఆకాంక్షించారు.
టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో నిర్మిస్తున్న హరిహర క్షేత్రం ఆలయ ప్రతినిధులు సోమవారం కాకినాడలోని శ్రీపీఠంలో స్వామి పరిపూర్ణానందను కలిశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, కేబీకే గ్రూప్ చైర్మన్ డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ ఆస్టిన్ లో నిర్మిస్తున్న ఆలయ వివరాలను వెల్లడించారు. ఆలయాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. వారి విన్నపానికి స్వామి పరిపూర్ణానంద సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హరిహర క్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, పాటించాల్సిన నియమ నిబంధనల గురించి కూలంకషంగా వివరించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటిలో అనేక ఆధ్యాత్మిక విషయాలను బోధించారు.
వీలు చూసుకొని హరిహర క్షేత్రాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ భేటిలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, డిజిటల్ కనెక్ట్ సీఈవో నికీలు గుండా తదితరులు పాల్గొన్నారు.