Tuesday 7th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ATMలో డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త!

ATMలో డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త!

atm news

ATM card swapping fraud | ఏటీఎం కేంద్రాల వద్ద నగదు డ్రా చేసేందుకు వచ్చే అమాయక ప్రజలను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

తాజాగా కవయ్యా స్టేషన్ సమీపంలోని IDBI బ్యాంక్ ఏటీఎం వద్ద ఒక మహిళా వినియోగదారురాలిని బురిడీ కొట్టించి ఇద్దరు దుండగులు రూ. 55,000 నగదును దోచుకున్నారు. బాధిత మహిళ నగదు విత్ డ్రా చేసేందుకు ఐడీబీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు.

ఆమె నగదు డ్రా చేసే క్రమంలో సహాయం చేస్తామన్న నెపంతో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు చేరారు. మాటల్లో పెట్టి ఆమె ఏటీఎం పిన్ నంబర్‌ను చాకచక్యంగా గమనించారు.

ఆపై మెరుపు వేగంతో ఆమె చేతిలోని ఏటీఎం కార్డును తీసుకుని, అదే కంపెనీకి చెందిన మరో నకిలీ కార్డును ఆమెకు తిరిగి ఇచ్చారు. కార్డు మారిందన్న విషయం గమనించని ఆ మహిళ అక్కడి నుంచి వెనుతిరిగారు.

వెంటనే ఆ దుండగులు ఆమె ఒరిజినల్ కార్డు మరియు పిన్ ఉపయోగించి ఏకంగా రూ. 55,000 నగదును డ్రా చేశారు.

కొద్దిసేపటి తర్వాత తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లను చూసి షాక్ తిన్న బాధితురాలు, కార్డును పరిశీలించగా అది తనది కాదని తేలింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల హెచ్చరిక..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏటీఎం వినియోగదారులకు పలు సూచనలు చేశారు. ఏటీఎం సెంటర్లలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం తీసుకోవద్దు. పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కీప్యాడ్‌ను మరో చేత్తో కవర్ చేయండి.

లావాదేవీ ముగిసిన తర్వాత కార్డు మీదేనా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఏటీఎం లోపల ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే బ్యాంకు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions