Free Bus For Women In AP | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh)లో మహిళలకు ఉచిత బస్సు (Free Bus) పథకానికి సంబంధించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) కీలక ప్రకటన చేశారు.
గురువారం తిరుపతి (Tirupati) జిల్లాలోని నాయుడుపేటలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని వివరించారు.
మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా అమలు కానుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ (Sri City)ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి.. ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ఈ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అందులోనూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.