Chandra Babu Dupe | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandra Babu Naidu) ఓ అభిమాని ఇమిటేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి అచ్చం చంద్రబాబు వేషధారణలో వచ్చారు.
పెళ్లి వేదికపైకి ఎక్కి చంద్రబాబులా హావభావాలు ప్రదర్శిస్తూ ఆయన గొంతును ఇమిటేట్ చేశాడు. అథితులను ఉద్దేశించి చంద్రబాబు గొంతులా మాట్లాడారు. ఈ వీడియో మంత్రి లోకేశ్ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు.
తాను ఆ వ్యక్తికి అభిమానిగా మారిపోయానని చెప్పారు చంద్రబాబుగారిలా మాట్లాడడానికి, కనిపించడానికి ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డాడో చూడండి అని ఆ వీడియోను పోస్ట్ చేశారు. టీడీపీ అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.