Wednesday 18th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > భారీ వర్షాలు..పెన్షన్ల పంపిణీ పై సీఎం కీలక నిర్ణయం!

భారీ వర్షాలు..పెన్షన్ల పంపిణీ పై సీఎం కీలక నిర్ణయం!

ap pension

Pensions Distribution In AP | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెన్షన్ల (Pensions) పంపిణీ సాగుతోంది. ఉదయం నుండే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది.

భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ లో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు.

భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సీఎం చెప్పారు.

పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

You may also like
chandra babu
మీ త్యాగాలు మరువను: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
adr releases assets of chief ministers in india
దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా..!
vijay sai reddy
‘పవన్ ను దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం’ : విజయసాయి రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions