Anant Ambani saves chickens | ఆసియ ఖండ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జంతువులు, పక్షులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.
చికెన్ షాపులకు సప్లై చేయడానికి ఓ వ్యాన్ లో తీసుకెళ్తున్న కోళ్లను ఆయన రక్షించారు. అనంత్ అంబానీ శ్రీకృష్ణడి భక్తుడు. ఈ క్రమంలో తన 30వ పుట్టినరోజును జరుపుకోవడానికి ఆయన గుజరాత్ లోని జామ్ నగర్ నుండి ద్వారక కు పాదయాత్రగా బయలుదేరారు.
140 కి.మీ. మేర పాదయాత్ర చేసి ద్వారకాదీశుడ్ని దర్శించుకొనున్నారు. కాగా పాదయాత్ర చేస్తున్న సమయంలో కంభాలియ ప్రాంతంలో రోడ్డుపై ఓ కోళ్ల వ్యాన్ అనంత్ అంబానీ కంట పడింది. దింతో వెంటనే ఆ వ్యాన్ ను ఆపి అంబానీ కోళ్లకు విముక్తి కల్పించారు.
వ్యాన్ యజమానికి డబ్బులు చెల్లించి కోళ్లను విడిపించారు. ఈ నేపథ్యంలో జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా, జామ్ నగర్ లో ‘వన్ తార’ పేరిట అనంత్ అంబానీ జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.