Anant Ambani embarks on ‘Padyatra’ from Jamnagar to Dwarkadhish Temple | రిలయన్స్ అధినేత, ఆసియలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు.
గుజరాత్ జామ్ నగర్ నుండి ద్వారక వరకు సుమారు 140 కి.మీ. ఈ పాదయాత్ర కొనసాగనుంది. మార్చి 28న పాదయాత్ర ను ప్రారంభించిన అంబానీ రోజుకు 10కి.మీ. నుంచి 12 కి.మీ. వరకు నడుస్తున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజును ద్వారకలో జరుపుకోనున్నారు.
తాను ఏ పని మొదలుపెట్టాలనుకున్నా మొదట ద్వారకాదీశుడిని ప్రార్థిస్తానని అనంత్ చెప్పారు. అనంత్ అంబానీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే వేసవి కావడంతో ఉదయం పూట విశ్రాంతి తీసుకుంటున్న అంబానీ రాత్రి వేళల్లో మాత్రమే నడుస్తున్నారు.
ఏప్రిల్ 1 వరకు ఐదు రోజులు దిగ్విజయంగా పాదయాత్ర చేపట్టినట్లు, ద్వారకను చేరుకోవడానికి మరో రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అనంత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా అనంత్ అంబానీకి ద్వారక శ్రీకృష్ణుడిపై అపార నమ్మకం.
ఈ నేపథ్యంలో యువత తాము సాధించే లక్ష్యాలను చేరుకోవాలంటే ద్వారకాదీశుడ్ని ప్రార్ధించాలని సూచించారు. కాగా గతేడాది అనంత్ అంబానీకి రాధిక మర్చంట్ తో వివాహం జరిగిన విషయం తెల్సిందే.