Ambati Rambabu News Latest | తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) తో గురువారం భేటీ అయిన విషయం తెల్సిందే.
అయితే ఈ భేటీపై మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు పరోక్షంగా స్పందిస్తూ సంచలన కామెంట్ చేశారు.
సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ క్రమంలో అంబటి రాంబాబు ‘ పూర్తి పరిష్కారానికి “Sofa” చేరాల్సిందే! ‘ అని పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప-2 ది రూల్ ( pushpa-2 The Rule ) మూవీలో సోఫా సీన్ హైలైట్ గా మారింది.
సోఫాలో రూ. కోట్లు పెట్టి రాజకీయ నాయకుడిగా బహుమతిగా ఇస్తాడు పుష్పరాజ్. మరి అంబటి రాంబాబు ఏ ఉద్దేశ్యంతో సోఫా అనే కామెంట్ చేశారో తెలియాల్సి ఉంది