Ambati Daughter Marraige News | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కుమార్తె అమెరికాలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ తణుకు కు చెందిన హర్షను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. హర్ష సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వీరి వివాహం ఇల్లినాయిస్లోని మహా లక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. నూతన వధూవరులను అంబటి రాంబాబు దంపతులు ఆశీర్వదించారు. వివాహం అనంతరం తన అల్లుడిని అందరికీ పరిచయం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోనే పెళ్లి ఘనంగా జరగేదని కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం మూలంగానే అక్కడే జరిగినట్లు చమత్కరించారు. ఒకవేళ ఇండియాకు వస్తే మళ్లీ వీసా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉందన్నారు. హర్ష తల్లిదండ్రులకు మూడు సార్లు అప్లై చేసినా వీసా రిజెక్ట్ అయినట్లు వివరించారు. ఇకపోతే వారు స్వదేశానికి తిరిగి వచ్చాక ఏపీలో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.









