Thursday 9th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘బ్లాక్‌బస్టర్ విజయానికి మీరే అర్హులు’: సమంత ఆసక్తికర పోస్ట్! 

‘బ్లాక్‌బస్టర్ విజయానికి మీరే అర్హులు’: సమంత ఆసక్తికర పోస్ట్! 

samantha

Samantha wishes Dacoit movie team | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’.

ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదలవుతున్న తరుణంలో, నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చిత్ర యూనిట్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత, అక్కినేని కుటుంబ సభ్యురాలు సుప్రియ యార్లగడ్డ గురించి సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమంత తన పోస్ట్‌లో సుప్రియను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

“సుప్రియ.. మీ కృషిని, పట్టుదలను, సినిమాపై మీకున్న అంకితభావాన్ని నేను స్వయంగా చూశాను. ఈ పనుల వెనుక ఉన్న మీ తపన నాకు తెలుసు.

ఒక బ్లాక్‌బస్టర్ విజయానికి మీకంటే ఎక్కువగా మరెవరూ అర్హులు కారు. మీకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఆల్ ది బెస్ట్ టీమ్ ‘డెకాయిట్’.” అని రాసుకొచ్చారు.

అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత సమంత ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాజెక్టులపై స్పందించడం చాలా అరుదు.

అయితే సుప్రియతో సమంతకు మొదటి నుంచీ మంచి సాన్నిహిత్యం ఉండటంతో, పాత జ్ఞాపకాలను మనసులో పెట్టుకోకుండా ఆమెను సపోర్ట్ చేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం సుప్రియకే కాకుండా హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌లకు కూడా సమంత కంగ్రాట్స్ చెప్పారు.

షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తోపాటు ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ & ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, సమంత వంటి స్టార్ సపోర్ట్ తో ‘డెకాయిట్’ టీమ్‌లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Image

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions