Allu Arjun Arrest News | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరు పట్ల అల్లు అర్జున్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అదుపులోకి తీసుకోవడం ఓకే కానీ, బెడ్రూం లోకి పోలీసులు వచ్చారని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు.
తనకు కనీసం దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. పోలీసులు తన పట్ల ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. మరోవైపు భర్త అరెస్ట్ సమయంలో స్నేహ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చిన అల్లు అర్జున్ అనంతరం పోలీసు వ్యాన్ ఎక్కారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పీఎస్ కు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది.