Allu Arjun About Social Media Post’s | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) సంచలన పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ( Sandhya Theater ) తొక్కిసలాట ఘటన రాజకీయ ప్రకంపనలు సృస్తిస్తోంది.
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) శనివారం నటుడు అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ ప్రముఖుల వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు తాము అల్లు అర్జున్ అభిమానులని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ( Social Media ) పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన అల్లు అర్జున్..’నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.