Characters United Through AI | సినిమా అనేది ప్రేక్షకులకు కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. సినిమా అంటే ఒక ఎమోషనల్ జర్నీ కూడా. చిత్రాల్లో కొన్ని పాత్రలు చాలా ప్రత్యేకం. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్నేళ్లయినా ఆయా పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతుంటాయి.
ముఖ్యంగా సినిమాలో మరణించిన కొన్ని పాత్రలు తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. అందులో ఇటీవల వచ్చిన జెర్సీలో నాని, గమ్యంలో అల్లరి నరేశ్, వేదంలో అల్లు అర్జున్, మనోజ్ పాత్రలు, సీతారామంలో రామ్, విక్రమార్కుడులో విక్రమ్ రాథోడ్, బాహుబలిలో అమరేంద్ర బాహుబలి, కలర్ ఫోటోలో జయకృష్ణ పాత్రలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.
అయితే కలర్ ఫోటోలో తన నటనతో ఆకట్టుకున్న సుహాస్ ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ సాయంతో ఈ పాత్రలన్నింటినీ ఒకే చోట చూపిస్తూ ఒక వీడియో రూపొందించారు. ఆ పాత్రలకు డైలాగులను పొందుపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మరోసారి ఆ పాత్రలను గుర్తుచేసుకుంటున్నారు.





