Sai Pallavi Visits National War Memorial | శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran).
మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar Periasamy) దర్శకత్వం వహించారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదల కాబోతుంది అమరన్.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగం గా సాయి పల్లవి నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. అక్కడ దేశ రక్షణ కోసం విధులు నిర్వస్తిస్తూ వీర మరణం పొందిన సైనికులకు ఆమె నివాళులు అర్పించారు.
తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నాను. ఇటీవల కొన్ని రోజుల క్రితం వెళ్ళా ను.
మన కోసం ప్రాణాలు అర్పిం చిన సైనికుల గురిం చి ఇటు కల లాం టి పలకల రూపం లో వారి వివరాలు ఉం చే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుం ద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సిం గ్(Vikram Singh) లకు నివాళులు అర్పి స్తున్నప్పు డు నేను చాలా ఎమోషనల్ అయ్యా ను’’ అని పోస్ట్ చేశారు. అక్కడ తీసుకున్న ఫొటోలు కూడా షేర్ చేశారు.