Sunday 11th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ రెడ్డి ప్యాలెస్ లోనే నటి జత్వాని పై స్కెచ్

జగన్ రెడ్డి ప్యాలెస్ లోనే నటి జత్వాని పై స్కెచ్

Kadambari Jethwani Case News | ముంబై నటి కాదంబరి జత్వాని కేసు ఏపీని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. ఇదిలా ఉండగా నటి కాదంబరి కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేసింది అధికార టీడీపీ.

‘ జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోనే, ముంబై నటి జత్వాని పై స్కెచ్. ఒక అమాయక మహిళని వేధించటానికి సీఎంఓని వేదికగా చేసుకుని వ్యవస్థల దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి. జనవరి 31 2024న, జగన్ రెడ్డి సీఎంఓగా మార్చుకున్న తాడేపల్లి ప్యాలెస్ లోనే కుట్ర చేసిన ముగ్గురు అధికారులు. జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి ఆదేశాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు. ఫిబ్రవరి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే జనవరి 31నే తాడేపల్లి ప్యాలెస్ లో కుట్ర. ఒక మహిళని లోబరుచుకోవటానికి, తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యవస్థల దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి. నాటి నేరస్తుడు పాలనలో అధికారులు కూడా నేరస్థులయ్యారు.. చివరకు బలయ్యారు ‘ అని టీడీపీ పేర్కొంది.

You may also like
కృష్ణా నదీ తీరం..పీపీపీ మోడల్ లో టెండర్లు
‘సీఎం వెన్నుపోటు పొడిచారు..ఓటుకు నోటు దొంగ చెప్పారు’
‘వైసీపీ ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారు’
పీపీపీ బిడ్..క్లారిటీ ఇచ్చిన కిమ్స్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions