-పైలట్, ట్రైన్ పైలట్ మృతి
-పెద్ద ఎగిసిపడిన మంటలు
హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ విమానం కుప్పకూలింది. తుప్రాన్ సమీపంలోని రావెల్లి గుట్టల్లో ఓ ట్రైనీ విమానం కూలిపోయింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భారీ శబ్ధంతో ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవ్వడాన్ని స్థానికులు గమనించారు. విమానం కూలడంతో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలు దావానంలా వ్యాపించడంతో.. విమానం కాలి బూడిదైంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కూలిన విమానం.. దుండిగల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణా విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు గుర్తించారు. పైలట్‌తో పాటు, శిక్షణ పైలట్ సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టరానంతగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.