Friday 25th April 2025
12:07:03 PM
Home > క్రైమ్ > ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

A family from Andhra Pradesh committed suicide.

అమరావతి : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవనాథపుర ఆంధ్ర ఆశ్రమంలో ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానిక పోలీసుల సమాచారం మేరకు ఈస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన కొండబాబు, అతడి భార్య లావణ్య, ఒక గదిలో, ఇద్దరు కుమారులు రాజేశ్‌, జైరాజ్‌ మరో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబం డిసెంబర్‌ 3 నుంచి గదిలో ఉంటున్నారు. ఆశ్రమ నిర్వహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You may also like
amith shah
రాష్ట్రాల సీఎంలకు హోం మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు!
‘నేను పాకిస్థానీ కాదు..ప్రభాస్ హీరోయిన్ కీలక పోస్ట్’
‘ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేదే లేదు’
‘ఐఎన్ఎస్ సూరత్ సీ స్కిమ్మింగ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions