KTR News Latest | కృష్ణా జలాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అన్యాయలకు వారిని ఉరి తీసినా తప్పులేదని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజగా ఈ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉరే తీయాలంటే ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీయలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని అశోక్ నగర్ వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన రాహుల్ గాంధీని ఉరి తీయాలని హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్.
రైతులకు రుణమాఫీ చేస్తామని మాట తప్పినందుకు వరంగల్ లో రాహుల్ గాంధీని ఉరి తీయలన్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేటీఆర్ మాట్లాడారు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి అధినేత రేవంత్ అని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ నికృష్టుడిలా జుగుప్సాకరమైన భాష మాట్లాడుతుంటే స్పీకర్ చూస్తూ కూర్చోవడం బాధాకరమన్నారు.









