PIB Factcheck On Rs. 500 Note | కొద్ది రోజుల నుంచి 500 రూపాయల నోటుపై ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంలలో 500 రూపాయల నోట్ల కనిపించవు. ఎందుకంటే ఆర్బీఐ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంది’ అంటూ ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ వైరల్ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. రూ. 500 కరెన్సీ నోట్లపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది.
ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దనీ, ప్రజలు ఈ నోట్లపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ. 500 నోట్లను యథావిధిగా వినియోగించుకోవచ్చని తెలిపింది.









