Sivaji vs Anasuya | నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యాంకర్ అనసూయ వరుస పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్ల దుస్తువులపై శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై అనసూయ స్పందించడం, వివరణ ఇచ్చే సమయంలో శివాజీ అనసూయ రుణం తీర్చుకుంటా అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు అనసూయపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ తనపై విమర్శలు, తన వయసుపై కామెంట్లు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు.
ఉన్న సమస్యపై దృష్టి పెట్టడం చేతకాక తన వయసును ప్రస్తావిస్తూ అంటీ అని కామెంట్లు పెడుతున్నారని అనసూయ పేర్కొన్నారు. కానీ నటుడు శివాజీని మాత్రం గారు అని సంబోధిస్తున్నారని తెలిపారు. ‘నాకు 40 ఏళ్ళు. శివాజీ గారికి 54 అనుకుంటా. వృత్తి రీత్యానో, వ్యక్తిగతంగానో మేము ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నాం. కానీ విమర్శలు చేసే వారు నిత్యం యవ్వనంగా ఉండేవాళ్లు కావొచ్చు’ అని ఎద్దేవా చేశారు.









