Sampoornesh Babu is back As Paradise Biryani | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సరికొత్త రోల్ లో కనిపించనున్నారు. మునుపెన్నడూ కనిపించని రగడ్ లుక్ లో ఈ హీరో దర్శనమిచ్చారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల-నచురల్ స్టార్ నాని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైస్’. సరికొత్త కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. తాజగా మూవీలోని సంపూర్ణేష్ బాబు లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. భయంకరమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు.
ఓ చేతితో గొడ్డలి, మరో చేత్తో బీడీ కాలుస్తూ రఫ్ లుక్ లో ఊరమాస్ అవతార్ లో ఉన్నారు. సంపూర్ణేష్ బాబు ఇక ఫన్నీ కాదు, బిర్యానీ ‘జడల్’ స్నేహితుడిగా కనిపించనున్నారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో నాని పాత్ర పేరు జడల్ అనే విషయం తెల్సిందే. ఇకపోతే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘శికంజ మాలిక్’ గా విలన్ పాత్రలో నటిస్తున్నారు. మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్-నాని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.









