MS Dhoni’s Advice To Newly-Married Couple | పెళ్లి అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే అంటూ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భార్య ముందు నువ్వు వరల్డ్ కప్ గెలిచావా లేదా అనేది అసలు మ్యాటరే కాదు అంటూ ధోని నవ్వులు పూయించారు. తాజగా ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు ధోని. ఇందులో భాగంగా పెళ్లి వేడుక పై నూతన వధూవరులకు కీలక సూచనలు ఇచ్చారు. ఈ వివాహం ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలీదు.
ఉత్కర్ష్-ధ్వాని ల పెళ్లి వేడుకకు హాజరైన ధోని ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పెళ్లి చాలా మంచిది. కానీ తొందరపడ్డారు’ అంటూ ధోని కామెంట్ చేయగానే అక్కడున్న వారు నవ్వుల జల్లులు కురిపించారు. నా భార్య అందరీలా కాదు అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుందన్నారు. వరల్డ్ కప్ గెలిచామా లేదా అనేది అసలు విషయమే కాదు, పెళ్లి తర్వాత ఎంత పెద్దవారైన భార్య ముందు నామమాత్రమే అంటూ కెప్టెన్ కూల్ అనడంతో నూతన వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన వారు నవ్వుకున్నారు.
అనంతరం ధోని మాట్లాడుతూ..భర్త కోపంగా ఉంటే, ఏమీ అనవద్దు, కేవలం ఐదు నిమిషాల్లోనే భర్త కోపం చల్లారుతుంది అని నూతన వధువుకు సలహా ఇచ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలోనూ పెళ్లిపై ధోని చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెల్సిందే.









