Bala Saraswathi Death News | తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి 97 సంవత్సరాల వయసులో బుధవారం ఉదయం కన్నుమూశారు.
ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1928లో సరస్వతి దేవి జన్మించారు. ఆరేళ్ళ వయసు నుండే పాడడం ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో కలిపి 2 వేలకు పైగా పాటలు పాడారు. చిన్నప్పటి నుండె పాటలు పడడంతో ఆమెను అందరూ బాల సరస్వతి అని పిలిచేవారు.
ఈ పేరే ప్రాచుర్యం పొందింది. ‘సతీ అనసూయ ధ్రువ విజయం’ సినిమాలో బాల నటిగా కనిపించారు. తొలి తెలుగు గ్రామ్ ఫోన్ రికార్డు కూడా ఆమెదే. వివాహం తర్వాత పాటకు దూరమయిన బాల సరస్వతి భర్త మరణాంతరం 1974లో తిరిగి పాడటం ప్రారంభించారు.









