Jubilee Hills Bypoll On Nov.11 | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. సోమవారం ఈసీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. దీనితో పాటే దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీలను వెల్లడించింది.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. అలాగే నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అక్టోబర్ 13న ఈ బై ఎలక్షన్ కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్లకు తుది గడువు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న ఎన్నికలు, 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.









