Supreme Court Former Judge Gopala Gowda Praises Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ. సోమవారం కర్ణాటకలోని చింతామణిలో జస్టిస్ వి.గోపాల గౌడ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ వి.గోపాల గౌడ..పవన్ తనకు ఆత్మీయ స్నేహితుడని చెప్పారు. తన ఆరోగ్యం బాలేకున్నా తనపై ఉన్న గౌరవంతో ఈ కార్యక్రమానికి వచ్చారని పేర్కొన్నారు. యువత గురించి, రైతుల గురించి, మహిళలను గురించి, వారి జీవనాభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచన చేసే మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు.
కోళార్, చిక్కబళ్ళాపూర్ సహా కర్ణాటకలోని మూడు జిల్లాలో నీటి సమస్య ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ ను జస్టిస్ గోపాల గౌడ కోరారు. అనంతరం మాట్లాడిన పవన్..తాను రాజకీయాల్లోకి వచ్చి మొదటి ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు తన భుజం తట్టి బలంగా ఉండు మంచి రోజులు వస్తాయ్ అని చెప్పిన వ్యక్తి జస్టిస్ వి. గోపాల గౌడ అని తెలిపారు. జనసేన సిద్ధాంతాలను, విలువలను ఆయన ఎంతో గౌరవిస్తారన్నారు. అందుకే చాలా పరిస్థితుల్లో జనసేన చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్నట్లు చెప్పారు.









