union Finance Minister Nirmala Sitaraman offered prayers in Tirumala temple | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి ఎ తర్వాత వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలా సీతారామన్ కు పండితులు ఆశీర్వచనం చేశారు.
అంతేకంటే ముందు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్రమంత్రి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆ తర్వాత అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు.









